హైదరాబాద్: 28°C
వార్తలు

V2V టెక్నాలజీపై కేంద్రం ఫోకస్

రోడ్డు భద్రతను మెరుగుపరిచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రయాణాల్లో ప్రమాదాలను నివారించేందుకు 'వెహికల్ టు వెహికల్(V2V) కమ్యూనికేషన్ సిస్టమ్'ను తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. వాహనాల మధ్య సమాచార మార్పిడికి వీలు కల్పించే ఈ అత్యాధునిక వ్యవస్థను దేశవ్యాప్తంగా దశలవారీగా అమలు చేయనున్నారు.