హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఇది మెరిట్ వర్సెస్ మాఫియా పోరాటం’

నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. విద్యార్థుల భావోద్వేగాలతో ఆడుకోవద్దని కాంగ్రెస్‌కు హితవు పలికారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య జరుగుతున్న పోరు కాదని.. మెరిట్, మాఫియా మధ్య పోరాటమని స్పష్టం చేశారు. ఫ్లాప్ అయిన పార్టీల కోసమే విద్యార్థులతో ఆందోళనలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు.