హైదరాబాద్: 28°C
వార్తలు

'భూ, తాగునీటి సమస్యలపై అర్జీలు'

ASR: పెదబయలు మండలం పర్రెడలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ మీకోసం కార్యక్రమానికి 15ఫిర్యాదులు అందాయని ఎంపీడీవో శ్యామ్ సుందర్ తెలిపారు. వీటిలో భూ సమస్యలు, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయన్నారు. పాఠశాల భవనానికి మరమ్మతులు చేపట్టాలని ఓ ఫిర్యాదు అందిందన్నారు. పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.