హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ సంచలన విజయం

మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ పోరులో కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై 6,016 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో దతియా స్థానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుంది. కాగా, భోపాల్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.