హైదరాబాద్: 28°C
వార్తలు

తెనాలి అభివృద్ధికి రూ.10 కోట్లు

GNTR: తెనాలి మున్సిపాలిటీ అభివృద్ధికి సీఆర్డీఏ ద్వారా రూ.10 కోట్లు మంజూరయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ నిధులతో 32 సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. పాత మున్సిపల్ కార్యాలయాన్ని తొలగించి కొత్త భవనం నిర్మిస్తామని వెల్లడించారు. పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు కొత్త చెత్త ఆటోలు తీసుకురానున్నట్లు తెలిపారు.