హైదరాబాద్: 28°C
వార్తలు

‘ఇరు దేశాల మధ్య వారధులుగా విద్యార్థులు’

భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య విద్యా, వృత్తిపరమైన మార్పిడి కార్యక్రమాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్‌లో 16,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే 3,000 మంది ఉజ్బెక్ నిపుణులు భారత ఐటెక్(ITEC) స్కాలర్‌షిప్‌లు పొందారు. వీరు రెండు దేశాల మధ్య బలమైన వారధులుగా నిలుస్తున్నారని ఆమె కొనియాడారు.