హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రపతితో ఉజ్బెకిస్థాన్ విదేశాంగ మంత్రి భేటీ

భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఉజ్బెకిస్థాన్ విదేశాంగ మంత్రి బఖ్తియార్ సైదోవ్.. రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ప్రాచీన 'సిల్క్ రోడ్' కాలం నాటి చారిత్రక సంబంధాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తుచేశారు. అరుదైన ఖనిజాలు, ఐటీ, ఫార్మా రంగాల్లో పరస్పర సహకారంపై ఇరు నేతలు కీలక చర్చలు జరిపారు.