హైదరాబాద్: 28°C
వార్తలు

అక్రమ పార్కింగ్‌తో ట్రాఫిక్‌కు అంతరాయం

KRNL: ఆదోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, ఫైర్‌స్టేషన్ సమీపంలోని రైల్వే స్టేషన్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలను ఇష్టారాజ్యంగా పార్క్ చేయడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. ప్రధాన రహదారిపైనే బైకులు నిలిపివేయడంతో వాహనదారులు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి అక్రమ పార్కింగ్‌ను అరికట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.