హైదరాబాద్: 28°C
వార్తలు

'జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి'

GNTR: జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్ కార్డులు, శాశ్వత ప్రెస్‌క్లబ్ ఏర్పాటు చేయాలని ఏపీజేఎఫ్ ప్రతినిధులు సోమవారం గుంటూరు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ కల్పించాలని కోరారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ సీ.ఎం. సాయికాంత్ వర్మ హామీ ఇచ్చారు.