హైదరాబాద్: 28°C
వార్తలు

కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే

TPT: పిచ్చాటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్మాణంలో ఉన్న కాంపౌండ్ వాల్ పనులను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిశీలించారు. పనులను నాణ్యతతో పాటు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కళాశాల ప్రిన్సిపాల్‌తో మాట్లాడి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ ఇళంగోవ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.