హైదరాబాద్: 28°C
వార్తలు

పెద్ది కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ

WGL: నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవలే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను బీజేపీ మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు ఇవాళ పరామర్శించారు. జిల్లా రాజకీయాలకు ఇది తీరని లోటని అన్నారు. ప్రజలతో నిరంతరం మమేకమై, ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తుండిపోతారని ఆయన పేర్కొన్నారు.