హైదరాబాద్: 28°C
వార్తలు

నిరసనలకు 'టౌన్ హాల్' వ్యవస్థ.. సీజేఐ వ్యాఖ్యలు

జంతర్ మంతర్ ఆందోళనల పిటిషన్ విచారణ సందర్భంగా.. నిరసనల కోసం 'టౌన్ హాల్' తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని పిటిషనర్ న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఏం చేయాలో ప్రభుత్వానికి బాగా తెలుసని, ఒకవేళ చేయకపోతే కోర్టుకు రావాలని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై సొలిసిటర్ జనరల్ సూచనలు తీసుకోవాలని పిటిషనర్‌కు సూచిస్తూ.. కేసును విడిగా లిస్ట్ చేయాలని ఆదేశించారు.