హైదరాబాద్: 28°C
వార్తలు

'మట్టి తవ్వేశారు.. న్యాయం చేయండి'

AKP: అచ్యుతాపురం మండలం దోప్పర్లలోని సాయిప్రియ లేఔట్-2 ప్లాట్లలో అక్రమంగా మట్టి, గ్రావెల్ తవ్వి తరలించారని బాధితులు సోమవారం కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేసి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. కో-జెడ్పీటీసీ నరమాల కుమార్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు వారికి మద్దతు తెలిపారు.