హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం, NDMCకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసనలు, ఆందోళనలను నియంత్రించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అక్కడ రాకపోకలతో పాటు వైద్య సామాగ్రి సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ అంశం అత్యంత ముఖ్యమైనదని వ్యాఖ్యానించిన సీజేఐ, దీనిపై కేంద్ర ప్రభుత్వం సహా ఎన్డీఎంసీకి నోటీసులు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.