హైదరాబాద్: 28°C
వార్తలు

సీబీఐ విచారణ కోరుతూ వినతి

VZM: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైసీపీ నేతలు కలెక్టర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.