హైదరాబాద్: 28°C
వార్తలు

'నేర చరిత్ర' అంటే ఏంటి?.. సీజేఐ స్పష్టత!

'నేర చరిత్ర' అనే పదాన్ని సాకుగా చూపి నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నారని లాయర్లు తెలపగా.. దీనిపై సీజేఐ స్పందించారు. 'నేర చరిత్ర' అంటే కేవలం తీవ్రమైన, ఘోరమైన నేరాలకు పాల్పడినవారు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారిని మినహాయించి, సాధారణ నిరసనకారులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.