హైదరాబాద్: 28°C
వార్తలు

13 వేల ఓట్ల ఆధిక్యంలో ప్రశాంత్ కిషోర్

బంకీపూర్(బీహార్‌) అసెంబ్లీ ఉపఎన్నికలో జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన ఆయన.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్‌పై సుమారు 13 వేల ఓట్ల లీడ్‌లో ఉన్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు నబీన్ రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక జరిగింది. పీకే ఆధిక్యంలో ఉండటంతో పట్నాలోని పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి.