హైదరాబాద్: 28°C
వార్తలు

కంభంలో తల్లిపాల వారోత్సవాలు

ప్రకాశం: కంభంలోని స్థానిక అర్బన్ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలో పట్టిన తల్లిపాలు బిడ్డకు జీవ రక్షక బిందువులని, పసుపు రంగులో ఉన్న చిక్కటి ముర్రుపాలు అమృతంతో సమానమని, పోషకాలను అందించి, పలు రకాల రోగాల నుంచి రక్షణ కలిగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ గాలెమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.