హైదరాబాద్: 28°C
వార్తలు

సెంట్రల్ కిచెన్ రద్దు చేయాలి: ఏఐటీయూసీ

NDL: జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల ఇవాళ ధర్నా నిర్వహించారు. సెంట్రల్ కిచెన్ విధానాన్ని రద్దు చేసి, కార్మికులకు రూ.15 వేల కనీస వేతనం, మెస్ చార్జీల పెంపు, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని జిల్లా కార్యదర్శి పీ. సుంకయ్య డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే డీఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.