హైదరాబాద్: 28°C
వార్తలు

వేదనారాయణస్వామిని దర్శించిన టీటీడీ చైర్మన్

TPT: నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామి ఆలయాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తన సతీమణితో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చైర్మన్ దంపతులకు అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం వేదపండితులు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.