హైదరాబాద్: 28°C
వార్తలు

'తుగ్గలిని కరువు మండలంగా ప్రకటించాలి'

KRNL: తుగ్గలిని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఐ నాయకులు, రైతులు తుగ్గలి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పంట నష్టపోయిన రైతులకు బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫీ చేసి రూ.50 వేల నష్టపరిహారం అందించాలని కోరారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.