హైదరాబాద్: 28°C
వార్తలు

ఎంజీ యూనివర్సిటీలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

NLG: మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సోమవారం సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఖమ్మం జిల్లాలో విద్యార్థి వేణుకుమార్ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని, ఖాళీగాఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.