హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులకు కేంద్రం ఊరట, చర్చలకు పిలుపు

ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వేదికగా భారీ ఊరటనిచ్చింది. నేర చరిత్ర లేని విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా, విద్యార్థులతో నేరుగా చర్చలు జరిపేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేసింది. ఈ వివాదాన్ని ఇకపై అనవసరంగా రగిలించొద్దని కేంద్రం కోరింది.