హైదరాబాద్: 28°C
వార్తలు

జంతర్ మంతర్ హింసపై సుప్రీం కీలక ఆదేశాలు

జంతర్ మంతర్ నిరసనలు, హింసపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో సీజేఐ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ ఘటనపై సిట్‌కు బదులుగా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో హై-పవర్డ్ కమిటీతో విచారణ జరిపించాలని కోర్టు ఆదేశించింది. ఎఫ్ఐఆర్‌ల నమోదులో కమ్యూనికేషన్ లోపం జరిగిందని సొలిసిటర్ జనరల్ కోర్టుకు వెల్లడించారు. వివాదాన్ని మరింత రగిలించొద్దని ఆయన కోరారు.