హైదరాబాద్: 28°C
వార్తలు

'తల్లిపాలు బిడ్డకు శ్రీరామరక్ష'

KMM: పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రీరామ రక్షని వైద్యులు సుప్రియ అన్నారు. చింతకాని (M) తిరుమలాపురం అంగన్వాడి కేంద్రంలో సోమవారం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, శిశు ఆరోగ్య పరిరక్షణ, తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అవగాహన కల్పించారు. తల్లిపాల వల్ల శిశువుకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు.