హైదరాబాద్: 28°C
వార్తలు

'నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉంచాం'

AP: ప్రకాశం జిల్లా కొండపిలో మంత్రి DSBV స్వామి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జేసీ కల్పనాకుమారితో కలిసి సరుకుల మినీ మార్ట్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'ప్రజలకు అందుబాటులో నాణ్యమైన బియ్యం ఉంచాం. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే కిలో ధర రూ.10-12 వరకు తక్కువ ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో BPT స్టీమ్డ్, రా రైస్ ఉన్నాయి' అని పేర్కొన్నారు.