హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. 15 మంది మృతి

కేరళంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల కారణంగా రహదారులపై నీరు ప్రవహించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు14 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో విద్యాసంస్థలకు అధికారులు సెలువులు ప్రకటించారు.