ASR: జీకేవీధి మండల విద్యాశాఖాధికారి (ఇన్‌ఛార్జ్)గా పీవీ ప్రసాద్ సోమవారం నూతనంగా బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ(ఎంఈవో-1)పనిచేసిన యూవీ నరసింగరావు పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో రింతాడ ప్రభుత్వోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్‌ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. మండలంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ప్రసాద్ అన్నారు.
వార్తలు
జీకేవీధి ఎంఈవోగా పీవీ ప్రసాద్ నియామకం


