హైదరాబాద్: 28°C
వార్తలు

గాగిల్లాపూర్‌లో బాలసభ

SDPT: బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ ఎర్రల జానకి రాజు అధ్యక్షతన బాల సభ నిర్వహించారు. చిన్నారులు పాఠశాల సౌకర్యాలు, తాగునీరు, పరిశుభ్రత, ఆటస్థలాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పిల్లల సూచనలకు ప్రాధాన్యం ఇచ్చి గ్రామాభివృద్ధిలో వాటిని అమలు చేస్తామని సర్పంచ్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు ఉన్నారు.