హైదరాబాద్: 28°C
వార్తలు

పిచ్చి మొక్కల తొలగింపు

MDK: చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో వర్షాల కారణంగా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించినట్లు సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి తెలిపారు. గ్రామంలో మురుగు కాలువల పక్కన పిచ్చి మొక్కలు పెరగడంతో తొలగిస్తున్నట్లు వివరించారు. అలాగే తడి పొడి చెత్తను వేరుచేసి అందజేయాలని, ఇళ్ల వద్ద నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని అవగాహన కల్పించినట్లు తెలిపారు.