హైదరాబాద్: 28°C
వార్తలు

కనిపించని సూచికతో ఇబ్బందులు

కోనసీమ: అమలాపురం-భట్నవిల్లి జాతీయ రహదారిలో వై. జంక్షన్ వద్ద గతంలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డు సరిగా కనిపించడం లేదు. ఇందులో పేర్కొన్న వివరాలు చెరిగిపోవడంతో అటుగా వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని వివరాలను సక్రమంగా నమోదు చేసి సూచిక బోర్డును అందుబాటులోకి తీసుకురావాలని వాహనచోదకులు కోరుతున్నారు.