హైదరాబాద్: 28°C
వార్తలు

బస్తాల సమస్యతో ఆందోళన

కోనసీమ: గత ప్రభుత్వం పాఠశాలల్లో చేపట్టిన 'నాడు-నేడు' పనుల్లో ప్రజాధనం వృథాగా పోయింది. ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి ZP ఉన్నత పాఠశాలల్లో పనుల కోసం తెచ్చిన సిమెంటు బస్తాలు గడ్డకట్టాయి. వాటిని ఆవరణలో నడవడానికి, పలుచోట్ల మెట్ల కింద వాడుతున్నారు. సరైన సమయంలో నిధులు, నిర్మాణ సామగ్రి మంజూరు చేయకపోవడంతోనే నిధులు వృధా అయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు.