హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి

ASR: ముంచంగిపుట్టు ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ రమేష్ సోమవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగంను కలిశారు. పాఠశాల సమస్యలను వివరించారు. పాఠశాల ప్రహరీ నిర్మాణం పూర్తి చేయాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న భవనం వర్షాల సమయంలో లీకేజీకి గురవుతోందని, టాయిలెట్ సమస్య కూడా పరిష్కరించాలన్నారు. దీనిపై ఎమ్మెల్యే కలెక్టర్‌కు ఫోన్ చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.