హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రమాదకరంగా డ్రైనేజీ గుంత!

JN: పట్టణంలోని సంజయ్‌నగర్ భగత్ సింగ్ చౌక్ వద్ద రహదారిపై డ్రైనేజీ గుంత ప్రమాదకరంగా మారింది. గుంతపై తాత్కాలికంగా ఇనుప షీట్ ఉంచి రాళ్లతో అడ్డుపెట్టినప్పటికీ, అది వాహనదారులు, పాదచారులకు ప్రమాదకరంగా ఉందని గతంలో ప్రమాదాలు జరిగాయని తెలిపారు. సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రమాదాన్ని నివారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.