SDPT: అక్కన్నపేట(M) కట్కూర్ గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్ల ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగిస్తూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొడముంజ బాలరాజు మాట్లాడుతూ గ్రామ ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడైనా అపరిశుభ్రత లేదా పిచ్చి మొక్కలు కనిపిస్తే వెంటనే గ్రామ పంచాయతీకి సమాచారం ఇవ్వాలని సూచించారు.
వార్తలు
రోడ్డు ఇరువైపుల పిచ్చి మొక్కలు తొలగింపు


