హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌పై చైనా సోషల్ మీడియా విషం

భారత్‌పై  చైనా సోషల్ మీడియా విషం కక్కుతుంది. భారత ఆహార అలవాట్లు, సంస్కృతిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర కంటెంట్ పోస్టు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిపై ఆ దేశంలో ఉంటున్న ప్రవాస భారతీయులు అసహనం వ్యక్తం చేశారు. అలాగే చైనాలో పని చేస్తున్న తమ జీవిత భాగస్వాములు ఉద్యోగాలు, ఉపాధి పొందటంపై ఆంక్షలు విస్తున్నట్లు వాపోతున్నారు. దీనిపై స్పందించాలని అక్కడి భారత ఎంబసీని కోరారు.