హైదరాబాద్: 28°C
వార్తలు

స్నేహితుల దినోత్సవం రోజునే విషాదం

VSP: పెదగంట్యాడ పాత గంగవరం బీచ్‌లో స్నేహితుల దినోత్సవం రోజు విషాదం చోటుచేసుకుంది. ఫొటోలు దిగుతుండగా నీతూ (18) సముద్రంలో పడిపోగా, కాపాడబోయిన దామోదర్ గల్లంతయ్యారు. కొద్దిరోజుల క్రితమే దామోదర్‌కి పెళ్లి నిశ్చయమయ్యింది. ఇంటర్ విద్యార్థిని నీతూ గల్లంతు కావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.