హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా గంజాయి పట్టివేత

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. దాదాపు 2.7 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిట్ క్యాట్ చాక్లెట్ బాక్సుల్లో గంజాయిని స్మగ్లింగ్ చేస్తుండగా గుర్తించి సీజ్ చేశారు. ఈ ఘటనలో ఓ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.