VZM: రాజాం పట్టణంలోని మారుతీనగర్ 5వ లైన్ లో రహదారి, కాలువలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డొంకలమిల్లు నుంచి మారుతీనగర్ పాఠశాల వరకు కాలువ నిర్మించకపోవడంతో మురుగు నీరు రోడ్డుపైకి చేరుతోంది. రహదారికి ఇరువైపులా ముళ్ల కంపలు పెరగడంతో విషసర్పాల సంచారం కూడా ఉంటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
రోడ్డు, కాలువలు లేక ప్రజలు అవస్ధలు


