హైదరాబాద్: 28°C
వార్తలు

ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం

బీహార్ సహర్సా జిల్లాలో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమస్తిపూర్-సహర్సా ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై రైలు నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మరికొందరిని రక్షించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఓ బోగీ పూర్తిగా ఆహుతైంది.