హైదరాబాద్: 28°C
వార్తలు

రహదారులపై నిలిచిపోతున్న నీరు

AKP: వర్షం పడితే పాయకరావుపేట మండలం పాల్మన్ పేటలో రహదారులపై నీరు నిలిచిపోతుంది. దీంతో గ్రామస్తులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. సైడ్ కాలువలు లేకపోవడంతో నీరు బయటికి వెళ్లి అవకాశం లేకుండా పోతుంది. దీంతో గ్రామంలో దోమలు వృద్ధి చెందడంలో వ్యాధులు వ్యాపిస్తుండడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.