హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నపూర్ణ జలాశయంలో 1.466 టీఎంసీల నీటి నిల్వ

SRCL: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ జలాశయంలో సోమవారం ఉదయం 6 గంటల నాటికి 388.70 అడుగుల నీటిమట్టం నమోదైంది. పూర్తి స్థాయి నీటిమట్టం 397 అడుగులు కాగా, ప్రస్తుతం 3.50 టీఎంసీల సామర్థ్యానికి గాను 1.466 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ లేకపోగా, ఆవిరి మరియు ఇతర కారణాల వల్ల 10 క్యూసెక్కుల నీటి నష్టం నమోదైంది.