హైదరాబాద్: 28°C
వార్తలు

చేపల పెంపకానికి భారీ నిధులు

MBNR: ప్రభుత్వం ఉచిత చేపల పంపిణీ కార్యక్రమానికి మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేప, రొయ్య పిల్లల కొనుగోలుకు రూ.116 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో కలిపి మొత్తం రూ.134.94 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.