హైదరాబాద్: 28°C
వార్తలు

గుంతలమయమైన రహదారి

MHBD: నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామం నుంచి కేసముద్రం మండల కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో గుంతల్లో నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు పెరిగింది. ఈ మార్గంలో ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు వెంటనే రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.