హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పర్యాటకులను ఆకట్టుకుంటున్న 'చేచర' జలపాతం

ASF: తిర్యాణి మండలం కౌటగం పంచాయతీ పరిధిలో 'చేచర' జలపాతం పూర్వవైభవంతో కళకళలాడుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి జలపాతం ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రకృతి రమణీయతతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ విహార దృశ్యాన్ని తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.