ASR: యూ-టర్న్ చేసే సమయంలో వెనుకనుంచి వచ్చే వాహనాలను తప్పనిసరిగా గమనించాలని కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు సూచించారు. రావణాపల్లిలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన సీఐ, అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
వార్తలు
'నిర్లక్ష్య డ్రైవింగ్.. కోల్పోతున్న ప్రాణాలు'


