హైదరాబాద్: 28°C
వార్తలు

గోదావరి అందాలకు నిదర్శనం

కోనసీమ: గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఆలమూరు మండలం జొన్నాడ–రావులపాలెం వంతెనలు గోదావరిలో మునిగి తేలుతున్నట్టుగా కనిపిస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎర్రటి వరద నీటిలో రెండు వంతెనలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ అందమైన దృశ్యాన్ని పలువురు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.