KMR: బిచ్కుంద అబ్కారీ శాఖ సీఐ కార్యాలయం వద్ద వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు ఏళ్లుగా మగ్గిపోతూ తుప్పుపడుతున్నాయి. కేసులు తేలకపోవడంతోనే వేలం వేయడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా నిరుపయోగంగా మారిన ఈ వాహనాలను వేలం వేస్తే ప్రభుత్వానికి తగిన ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
వార్తలు
తుప్పుపడుతున్న వాహనాలు.. వేలం వేస్తే ఆదాయం


