హైదరాబాద్: 28°C
వార్తలు

సరిహద్దులో భారీగా హెరాయిన్ పట్టివేత

రాజస్థాన్ బీకానేర్‌ ప్రాంతంలో భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు. మొత్తం 10 కేజీల హెరాయిన్‌ సహా రూ.కోట్ల విలువ చేసే 11 విదేశీ తయారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పాక్ సరిహద్దు వెంట డ్రోన్ల సాయంతో వీటిని సరఫరా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.