హైదరాబాద్: 28°C
వార్తలు

నేటి నుంచి ఇస్సానగర్‌లో ఊర పండగ

KMR: బీబీపేట మండలం ఇస్సానగర్‌లో సంప్రదాయబద్ధంగా నిర్వహించే 'ఊర పండగ' నేడు ప్రారంభమవుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఐదు రోజుల పాటు పండగ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 3(సోమవారం)న వాట్ల తిరగడం (గ్రామ సరిహద్దుల చుట్టూ తిరగడం), 4న సార్గమ్మ పండగ(వంటలకు పోవడం), 5న ఊరడమ్మ పండగ, 7న దుర్గమ్మ పండగ ఉంటాయని అన్నారు.